ETV Bharat / state

'తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతోంది' - telangana varthalu

Minister Errabelli Dayakar Rao: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ఇటీవల జాతీయ అవార్డులు పొందిన ఉత్తమ జడ్పీ, ఎంపీపీ, గ్రామ సర్పంచ్​లను మంత్రి ఎర్రబెల్లి ఘనంగా సన్మానించారు. మొత్తం 19 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు.

Minister Errabelli Dayakar Rao: 'తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతుంది'

author img

By

Published : Apr 24, 2022, 7:40 PM IST

Minister Errabelli Dayakar Rao: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కొర్రీలు పెడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ శాఖలకు వచ్చే నిధులను కుదించారన్నారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రానికి నిధులిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ఇటీవల జాతీయ అవార్డులు పొందిన ఉత్తమ జడ్పీ, ఎంపీపీ, గ్రామ సర్పంచ్​లను మంత్రి ఎర్రబెల్లి ఘనంగా సన్మానించారు.

'తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతుంది'

పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని.. అభివృద్ది పథంలో దూసుకుపోతున్నాయని అన్నారు. మొత్తం 19 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు. నాలుగు కేటగిరీలుగా అవార్డులు అందజేశారన్నారు. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్​గా సిరిసిల్లను ఎంపిక చేశారని, 4 ఉత్తమ మండల పరిషత్​లు, 11 ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయన్నారు. ఉత్తమ జిల్లా ప్రజా పరిషత్​కు రూ.50లక్షలు, మండల పరిషత్​కు రూ.25లక్షలు, గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ.5 నుంచి రూ.10లక్షలు అందజేశారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఒక్క అవార్డు మాత్రమే వచ్చిందని.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు అవార్డులు వచ్చాయని.. క్రమంగా అవార్డుల సంఖ్య పెరిగిపోతుందన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలకు మంత్రి చేతుల మీదుగా సన్మానం, అవార్డులను, ప్రశంసాపత్రాలను అందజేశారు.

'ఎంతో కష్టపడి పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. చిన్న గ్రామ పంచాయతీకి కూడా 5 లక్షల రూపాయల నిధులు అందిస్తున్నాం. ఇంత చేస్తున్నా తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతోంది. కేంద్రం గ్రామపంచాయతీలకు ఇచ్చేది నెల రూ.237 కోట్లు మాత్రమే. మళ్లీ ఇలా చేస్తూనే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తలేవు అని భాజపా ఎంపీలు స్టేట్​మెంట్లు ఇస్తారు.' -ఎర్రబెల్లి దయాకర్​ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.