రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనుమాస్ పల్లి గ్రామంలో మహేశ్వర మహా పిరమిడ్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ధ్యానం నిర్వహించనున్నారు. ధ్యానం చేసేందుకు వచ్చిన ఔత్సాహికులతో పిరమిడ్ ప్రాంతమంతా సందడి నెలకొంది. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆధ్వర్యంలో సామూహిక సంగీత ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా మహా పిరమిడ్ ధ్యాన మహాచక్రం కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'కోరికలే అనేక అనర్థాలకు కారణం'
దిశ కేసులో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ మహా పిరమిడ్ ధ్యాన మహా చక్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక అనర్థాలకు కోరికలే కారణమవుతున్నాయని, ఇందుకు మనసును అదుపులో ఉంచుకోవడమే ముఖ్యమన్నారు.
కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : వీవీఐటి కళాశాలలో ఉత్సాహంగా యువజనోత్సవాలు