నిర్లక్ష్యంగా వాహనం నడిపి వెనుక కూర్చున్న యువకుడి మృతికి కారణమైన వ్యక్తిని రంగారెడ్డి జిల్లా మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు. ఈనెల 23న మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మియాపూర్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై మధు, కరుణాకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధు రోడ్డు డివైడర్‌ను ఢీకొనడం వల్ల ఇద్దరూ కింద పడ్డారు.
వెనుక కూర్చున్న కరుణాకర్ తలకు బలమైన గాయాలు కావడం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మధు నిర్లక్ష్యం వల్లే కరుణాకర్ దుర్మరణం చెందాడని తేలగా పోలీసులు మధుపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మధుకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసి కూడా అతనికి ద్విచక్ర వాహనం ఇచ్చిన వాహన యజమాని ప్రదీప్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల మృతికి కారణమైతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: మారు పేర్లతో గాలం.. అందిన కాడికి మోసం..