రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పర్వేదలో మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలతో ఆద్యంతం సందడిగా మారింది. మహిళలు అలంకరించిన బోనాలతో స్వామి ఆలయానికి బయలు దేరారు.
మల్లికార్జున స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం శివసత్తులు, పోతరాజుల అగ్నిగుండాల ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు జరపండి!