రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని.. కాంగ్రెస్కు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఫొటో పెట్టుకుని ఓట్లు అడగటమే ఇందుకు నిదర్శనమన్నారు.
తనను గెలిపిస్తే.. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు పోరాటం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా రెడ్డి అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్లు రవి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'