మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా షాదనగర్ పరిధిలోని రామేశ్వరం ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి... స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ప్రజలకు ధర్మదర్శనాన్ని, ప్రత్యేకంగా వీఐపీ దర్శనాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువకావడం వల్ల ప్రత్యేక పూజలు రద్దు చేసి స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారు. మరోవైపు సమీప కొండమీద వెలసిన అమ్మవారి ఆలయాన్ని సైతం భక్తులు సందర్శించారు. వేడుకల్లో చిన్నారుల కోలాహలం కనిపించింది.
ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు