ఇవీ చదవండి:అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం
చిరుత దాడిలో మరో లేగదూడ మృతి - CHIRUTHA
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో నెలరోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇన్ని రోజులు గడుస్తున్నా అధికారులు చిరుత పులిని పట్టుకోలేకపోయారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిరుత దాడిలో మరో లేగదూడ మృతి
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వయిపల్లి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్నటికి నిన్న చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. గత నెల రోజులుగా కడ్తాల్ మండలంలో చిరుత సంచరిస్తోంది. ప్రజలు బయటకు వెళ్లడానికే భయపడిపోతున్నారు. ఇన్ని రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుతును పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇప్పటికే మండలంలో 10 లేగదూడలపై చిరుత దాడి చేసి చంపిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చిరుతను పట్టుకొని తమను కాపాడాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం
Intro:Body:Conclusion:
Last Updated : Mar 28, 2019, 1:30 PM IST