లాక్డౌన్ నేపథ్యంలో పేద న్యాయవాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల విషయంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 25 కోట్ల విషయంలో పదేళ్ల స్టాండింగ్ విధానాన్ని అమలు చేయకూడదంటూ నిరసనకు దిగారు.
పదేళ్ల స్టాండింగ్‌తో నిమిత్తం లేకుండా నిరుపేద న్యాయవాదులందరికీ నిధులందేలా చూడాలని కోరారు. ప్లకార్టులను ప్రదర్శించి, నినాదాలు చేశారు. స్టాండింగ్ విధానాన్ని ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు