ETV Bharat / state

ఇంటి పన్ను కడతామన్నా లంచమేనా..! - ఇంటి పన్ను కడతామన్నా లంచమేనా..!

ఇంటి పన్నులు కట్టి క్లియరెన్స్ తీసుకోవాలంటే... 10 వేల రూపాయల లంచం అడిగాడు. డబ్బులు తీసుకుంటూ అనిశాకి దొరికిపోయాడు శేఖర్ రెడ్డి.

ఇంటి పన్ను కడతామన్నా లంచమేనా..!
author img

By

Published : May 17, 2019, 4:26 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పట్టణంలోని పురపాలక కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణానికి చెందిన దంతవైద్యుడు నరేందర్..చతన్​పల్లి వద్ద ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ ఇంటికి సంబంధించి గత యజమాని కొన్ని వేల రూపాయల పన్నులు చెల్లించాల్సి ఉంది. నరేందరే ఆ పన్నులను చెల్లించి క్లియరెన్స్ చేసుకోవాలనుకున్నాడు. పురపాలక కార్యాలయానికి వెళ్లాడు. క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలంటే 10 వేల రూపాయలు లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ శేఖర్​రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ విషయంపై నరేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం డబ్బులు చెల్లించే సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని 10 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంటి పన్ను కడతామన్నా లంచమేనా..!

ఇవీ చూడండి: 35 కేంద్రాలు... 3 వేల టేబుళ్లు... 20 వేల సిబ్బంది

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.