రంగారెడ్డి జిల్లా బండగ్పేట్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అక్కడ పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీనితోపాటు బుక్ ఆన్ డిమాండ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని.. పూర్తి మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియ ఉంటుందన్నారు. ఎవరి మాటలు విని మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా ఛైర్మన్ పాండురంగారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: Metro Dance Viral: మెట్రో స్టేషన్లో అమ్మాయి క్రేజీ డాన్స్.. టాక్ ఆఫ్ టౌన్‌గా వీడియో..