రంగారెడ్డి జిల్లా జల్పల్లి, షాహీన్ నగర్, శ్రీ రాం కాలనీ, ఎర్రగుంట పహడి షరీఫ్ తదితర ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలకు ప్రజలు భారీగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జల్పల్లి పురపాలికలో 61,511 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 28 వార్డులకు సంబంధించి 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఎలాంటి అవాంఛనీయ, ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్దులు, వికలాంగులు సైతం ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు. వీరి కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు.