కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పెట్టుబడిదారీ వ్యవస్థలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని ఫోరం ఫర్ ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ కిరణ్ చంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలో ఫోరం ఫర్ ఐటీ ఆధ్వర్యంలో భారత్ బంద్‌కు మద్దతుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిరసన తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలు బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలకు మేలు చేకూరుస్తాయని.. దీనివల్ల రైతులకు ఎలాంటి లాభం కలగదని కిరణ్‌చంద్ర అన్నారు. కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బంద్‌కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు