ETV Bharat / state

Corona Vaccine: తోపులాటలు, తొక్కిసలాటలు,ఘర్షణలు.. టీకా కోసం తప్పని తిప్పలు - corona vaccination in rangareddy district

కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న భాగ్యనగర ప్రజలు.. ఒక్కసారిగా.. పెరుగుతున్న కేసులతో భయాందోళనకు గురవుతున్నారు. రెండో దశ సృష్టించిన విలయం గుర్తొచ్చి.. కొవిడ్ టీకా(Corona Vaccine) కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా రెండో డోసు తీసుకునే వారు టీకాకోసం బారులు తీరుతున్నారు. పెద్దఎత్తున తరలివస్తోన్న ప్రజలతో.. వ్యాక్సినేషన్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. పలుచోట్ల తోపులాటలు, ఘర్షణలు, తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి.

టీకా కేంద్రాలకు ప్రజల పరుగులు
టీకా కేంద్రాలకు ప్రజల పరుగులు
author img

By

Published : Jul 31, 2021, 2:03 PM IST

భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకా(Corona Vaccine) కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా రెండో డోసు కోసం ప్రజలు ఆయా కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. వేలాది మంది వస్తుండడంతో పలు కేంద్రాల్లో తొక్కిసలాట జరిగి గాయపడుతున్న ఘటనలూ ఉన్నాయి. వెస్టు మారేడుపల్లిలో శుక్రవారం వేలాదిగా టీకాల కోసం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కనీస సమాచారం లేకుండా టీకాలు వేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు డోసుల సంఖ్య తగ్గిపోవడంతో కేంద్రాలకు వచ్చిన వారందరికీ టీకాలు వేయకపోవడంతో నిరసన వ్యక్తమవుతోంది.

వెస్ట్‌ మారేడుపల్లిలో బారులుతీరిన జనం

ఎంత దారుణం..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 157 టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తే శుక్రవారం 28,967 వేలమందికి మాత్రమే వ్యాక్సిన్‌(Corona Vaccine) వేశారు. టీకాల కోసం ఈ కేంద్రాలకు దాదాపు 75 వేల మంది వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 154 కేంద్రాల్లో శుక్రవారం వేసిన డోసుల సంఖ్య 11,346 మాత్రమే. మేడ్చల్‌ జిల్లాలో 124 కేంద్రాల్లోనూ 9,438 మందికి మాత్రమే డోసులు వేశారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 31.90 లక్షలు, రంగారెడ్డిలో 19.57 లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో 18.48 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. దీన్నిబట్టి చూస్తే మొత్తం అందరికీ రెండుడోసుల టీకాలు వేయాలంటే ఎన్ని నెలలు అవుతుందో తెలియడం లేదని అధికారులే చెబుతున్నారు. కొవిషీల్డ్‌ వేసుకున్న వారు రెండోడోసుకు మూడు నెలలు గడువు ఉండడంతో కొంత నిశ్చింతగానే ఉంటున్నారు. అదే కొవాగ్జిన్‌ అయితే 28 రోజుల తరువాత రెండోడోసు వేసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ టీకా వేసుకున్న వేలాది మంది వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. డోసులు తక్కువగా ఉండటంతో తీవ్రమైన రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరుగుతోంది. ఇందుకు ఉదాహరణ శుక్రవారం వెస్టుమారేడుపల్లిలో జరిగిన ఘటనే.

ముషీరాబాద్‌లో టీకా సెంటర్‌ వద్ద..

ఏదీ ముందస్తు సమాచారం..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని టీకా కేంద్రాలకు మరుసటి రోజు ఎన్ని డోసులు(Corona Vaccine) వస్తాయన్న సమాచారం ముందే చేరడం లేదు. ఏరోజుకారోజే అధికారులకు సమాచారం అందుతోంది. అప్పటికే వేలాది మంది క్యూలో ఉంటే వంద డోసులు వేసి కేంద్రాన్ని మూసివేస్తున్నారు. దీంతో వచ్చిన వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే ముందస్తు సమాచారం ఉంటే.. ఎన్ని డోసులు ఉంటే అంతమంది ఉండి.. మిగిలిన వారు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

తక్కువగా రావడం వల్లే...

కేంద్ర ప్రభుత్వం నుంచి టీకా డోసులు(Corona Vaccine) తక్కువగా రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చిన డోసుల్లో అధిక భాగం హైదరాబాద్‌లో వినియోగించడంపైనే దృష్టిసారించామని పేర్కొంటున్నారు. ముందస్తుగా సమాచారం తెలిస్తే వెంటనే టీకా కేంద్రాలకు తెలియజేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు.

జిల్లాలు.. టీకా కేంద్రాలు

ఒక్కసారిగా ఎగబడి.. ఘర్షణలో కిందపడి

తొక్కిసలాటలో కిందపడిన వారిని పక్కకు లాగుతున్న సిబ్బంది

నగరంలోని వెస్ట్‌మారేడుపల్లి మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన టీకా(Corona Vaccine) కేంద్రానికి శుక్రవారం పౌరులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భారీగా కేంద్రానికి చేరుకోవడం.. వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కిందపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న మారేడుపల్లి పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వారిని పక్కకు లాగేశారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా.. ప్రథమ చికిత్స చేశారు. ఈ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు అందుబాటులో లేకపోవడం, ఈ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి తక్కువగా ఉండటంతో జనాలు బారులు తీరుతున్నారు. మొత్తం 2084 మందికి టీకా వేసినట్లు పాన్‌బజార్‌ యూపీహెచ్‌సీ వైద్యురాలు, కేంద్రం ఇన్‌ఛార్జి మృదుల తెలిపారు. కొవాగ్జిన్‌ రెండో డోసుకు గడువు 28 రోజులు దాటి 15 రోజులు గడిచినా తీసుకోవచ్చని సూచించారు. టీకాల కొరత లేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.