ETV Bharat / state

'బీ అలర్ట్.. రానున్న రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు' - తెలంగాణ వార్తలు

Hyderabad Meteorological Center: రాష్ట్రంలో పలుచోట్ల రాబోయే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటన వెల్లడించింది. ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది.

Weather report released by Hyderabad Meteorological Center
వెదర్​ రిపోర్ట్ విడుదల చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
author img

By

Published : Mar 19, 2023, 8:48 PM IST

Hyderabad Meteorological Center: రాష్ట్రాన్ని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు మరో 2 రోజుల పాటు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం ఇదే మాదిరిగా వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

నిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్బ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయటకి వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పడిన వడగళ్ల వర్షానికి తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు. రైతులు అధికంగా పంట నష్టం జరిగిందని వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో పడే వర్షాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈరోజు మోస్తారు వర్షాలు వస్తాయని.. దానికి తగినట్టు వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.

గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలు వల్ల రైతులు ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వడగళ్ల వర్షంతో రాష్ట్రంలో వివిధి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరి, మొక్కజొన్న, మిరప, మామిడి, పత్తి, పెసర, కొత్తిమీర.. తదితర పంటలు చేతికి అందకుండా పోయాయని కర్షకులు బాధపడుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడినందున కొన్ని పంటలు నీటితో మునిగిపోయాయి. మొక్కజొన్న ఈదురు గాలుల తాకిడికి నేల వాలింది. వీటితో పాటు పశుసంపదను అన్నదాతలు కొల్పోయారు. గొర్రెలు, ఆవులు, గేదెలు రాష్ట్రంలో కొన్ని ప్రదేశాల్లో మృత్యువాత పడ్డాయి. ఈ పంటలకు పరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. గవర్నమెంట్​ ఆదుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు వల్ల పలుచోట్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో పంటలకు భారీగా నష్టం ఏర్పడింది. వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.