ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలంటూ స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు ధర్నాకు దిగారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలు చేయడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయేతర ఆస్తుల నమోదులో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నందు వల్ల పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థిరాస్తి వ్యాపార సంఘం అధ్యక్షులు మక్బుల్, రవీందర్, ఆముదాల యాదగిరి, దస్తావేజు లేఖరులు బత్తుల కృష్ణారెడ్డి, నరహరి పాల్గొన్నారు.