గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కేసీ తండాలో పర్యటించనున్నారు. గిరిజనుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గిరిజనులతో కలిసి గవర్నర్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కరోనా వ్యాక్సిన్ పట్ల గిరిజనుల్లో ఉన్న అపోహలు తొలగించటంతోపాటు వంద శాతం వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా తమిళిసై గిరిజనులతో పాటు టీకా తీసుకుంటారు.
గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గవర్నర్ గతంలోనే పిలుపునిచ్చారు. ఈ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు గవర్నర్ కేసీ తండాలో పర్యటించనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏప్రిల్ 2న కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రిలో తమిళిసై వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదీ చదవండి: ETALA: 'దొంగ ఓట్లు నమోదు చేసి నన్ను ఓడించేందుకు కుట్ర'