ETV Bharat / state

'ప్రభుత్వమే కబ్జా చేస్తే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి'

ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తే వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనపరచుకుని అతనిపై చర్యలు తీసుకుంటారు. మరి ప్రభుత్వమే ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాడు ఓ బాధితుడు.

'ప్రభుత్వమే కబ్జా చేస్తే.. ఇక నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి'

author img

By

Published : Dec 24, 2020, 12:50 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్​మెట్ మండలం బాటసింగారంలోని సింగరేణి ఎంప్లాయిస్ కాలనీలో 2007లో 200 గజాల ప్లాటును కొత్తపేటకు చెందిన ఫణీంద్ర కొనుగోలు చేశాడు. కష్టపడి కొన్న ప్లాటును ఇప్పుడు ప్రభుత్వమే కబ్జా చేసిందని, సదరు ప్లాట్​లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్​ను కట్టారని వాపోయాడు. రెండేళ్ల క్రితం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను ఫణీంద్ర అడ్డుకోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు.

2019లో మళ్లీ పనులు ప్రారంభించారు. అదే సమయంలో ఫణీంద్రకు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకుని బాధితుడు ప్లాట్​కు వెళ్లేసరికి అప్పటికే ట్యాంక్ నిర్మాణం జరిగిపోయింది. ఈ అంశంపై స్థానిక సర్పంచ్​ను నిలదీయగా తనకు తెలియదని ఆర్​డబ్ల్యూఎస్ అధికారులను అడగాలని చెప్పారు.

దిక్కుతోచని స్థితి...

అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని... ఇప్పటికే కలెక్టరేట్​, సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్​డౌన్​లో ఉన్న ప్రైవేటు ఉద్యోగం పోయిందని... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానన్నాడు.

నా ప్లాటు నాకు ఇప్పించండి...

కష్టపడి బిడ్డ పెళ్లి కోసం కొన్న ఒక్క ప్లాటును అధికారులే కబ్జా చేస్తే తాను ఎవరికి చెప్పుకోవాలని నిలదీస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు మిషన్ భగీరథ ట్యాంక్​ను తొలగించి తన ప్లాటు తనకు అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.

ఇదీ చూడండి: బాతిక్‌ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.