ETV Bharat / state

ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు.. - Ibrahimpatnam incident latest news

IBRAHIMPATNAM INCIDENT
IBRAHIMPATNAM INCIDENT
author img

By

Published : Sep 24, 2022, 8:57 AM IST

Updated : Sep 24, 2022, 10:07 AM IST

08:54 September 24

ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు..

Ibrahimpatnam Incident Latest Update: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

గత నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఆపరేషన్​ వికటించి మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి..:

నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటి..?

ఇబ్రహీంపట్నం ఘటనపై డీహెచ్ స్పందన, సర్జరీ చేసిన డాక్టర్ సస్పెండ్‌

శిందే వర్గానికి షాక్.. ఠాక్రే శివసేన ఆధ్వర్యంలోనే దసరా ర్యాలీ

Last Updated : Sep 24, 2022, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.