హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం వ్రత మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిత్తుం శిఱుకాలే, వంగక్కడల్, విశేష పాశురములు, పులిహోర, చక్కెర పొంగలి, రవ్వ కేసరి ప్రసాదాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 60 జంటలు పాల్గొన్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి