గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆబ్కారీ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తూ, పర్మిట్ గదులకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందని ఆగ్రహించారు. ప్రధాన రహదారుల పక్కన మద్యం షాపులకు అనుమతులు ఇవ్వడం వల్ల వాహనదారులు, పాదచారులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల రాష్ట్రంలో దిశ లాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న మద్యం దుకాణాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : మోడువారిన జీవనం... కట్టెల 'మోపు' పైనే భారం