రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లోని చిత్ర లే అవుట్ కాలనీలో కొలువైన గణనాథునికి కాలనీవాసులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం కాలనీవాసులంతా అక్కడే సరదాగా గడుపుతున్నారు. బుధవారం బొజ్జ గణపయ్యకు పూజల అనంతరం కాలనీవాసులంతా కలిసి కోలాటాలాడారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సంతోషంగా గడిపారు.
కరోనా దృష్ట్యా నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకుంటున్నట్లు కాలనీ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి పేర్కొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గత మూడు సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే ప్రతిష్టించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక్క వినాయక చవితికే కాకుండా అన్ని పండుగలకు కాలనీవాసులంతా ఒక కుటుంబంలా చేరి.. ఆనందోత్సాహాల నడుమ వేడుకలు జరుపుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాలనీ అభివృద్ధికి దోహదపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు సుప్రీంలో విచారణ