ETV Bharat / state

27 నుంచి కొహెడలోనే పండ్ల మార్కెట్‌: సబితా ఇంద్రారెడ్డి - mla manchireddy kishan reddy

హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 27వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడలో పండ్ల మార్కెట్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

gaddiannaram fruit market shifted to koheda in rangareddy district
27 నుంచి కోహెడలో పండ్ల మార్కెట్‌: సబితాఇంద్రారెడ్డి
author img

By

Published : Apr 18, 2020, 1:53 PM IST

ఈ నెల 27వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడలో పండ్ల మార్కెట్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ఇక్కడికి తరలించనున్నారు.

ఈ విషయమై ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్‌నర్సింహగౌడ్‌, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 26 వరకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ మూసివేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.