రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం డివిజన్‌లో రూ. 50 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టానని... మళ్లీ గెలిపిస్తే రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని తెరాస కార్పొరేటర్ అభ్యర్థి భవాణి ప్రవీణ్ స్పష్టం చేశారు. అధికారంలో తెరాస ప్రభుత్వమే ఉన్నందున తనని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
డివిజన్‌లో ప్రతి కాలనీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. వరదల సమయంలో ప్రజల వెన్నంటి ఉన్నానని పేర్కొన్న అయన బాధితులకు రూ. 10వేల పరిహారం అందించామని మిగిలిని వారికి కూడా ఎన్నికల తర్వాత అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా