ETV Bharat / state

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం మహోన్నతమైంది: శ్రీ శ్రీ రవిశంకర్ - రంగారెడ్డి జిల్లా తాజా సమాచారం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌(Green India Challenge) కార్యక్రమం మహోన్నతమైందని ప్రముఖ యోగ గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar news) అన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతిని కాపాడాలనే ఆలోచన అద్భుతమైందని తెలిపారు. ఈ కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు.

Sri Sri Ravi Shankar participated Green India Challenge
Sri Sri Ravi Shankar
author img

By

Published : Nov 23, 2021, 4:57 PM IST

ఎంపీ సంతోశ్​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్(Sri Sri Ravi Shankar participated Green India Challenge) అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు చేస్తున్న కార్యక్రమాలు తననెంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో(Sri Sri Ravi Shankar telangana tour) ఉసిరి మొక్కను నాటారు.

భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతిని కాపాడాలనే ఆలోచన అద్భుతమైందని శ్రీ శ్రీ రవిశంకర్(Sri Sri Ravi Shankar news) అన్నారు. ఈ సందర్భంగా చెట్ల ఔన్నత్యాన్ని చాటేలా భారతీయ సంస్కృతిలో చెట్ల ప్రాముఖ్యతను తెలిపేలా ముద్రించిన 'వృక్ష వేదం పుస్తకం' గురించి గ్రీన్ ఇండియా ఛాలెంట్ ప్రతినిధి రాఘవ రవిశంకర్​కు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్‌ రావు, మల్లిఖార్జున్​ రెడ్డి, ఆశ్రమ సభ్యులు, ఇతర భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అభినందన్ మా విమానాన్ని కూల్చలేదు: పాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.