ETV Bharat / state

TALASANI: 'త్వరలో పలు రాష్ట్రాల్లో డెయిరీ ఔట్ లెట్లు ప్రారంభిస్తాం'

విజయ డెయిరీ బలోపేతంపై మరింత దృష్టి పెడతామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో విజయ మెగా డెయిరీ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మంతులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

talasani
talasani
author img

By

Published : Sep 3, 2021, 3:53 PM IST

విజయ డెయిరీ చరిత్రలో కొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల పెంపుదలే లక్ష్యంగా మెగా డెయిరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాడి పరిశ్రమాభివృద్ధిసంస్థ ఛైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అనితరాజేంద్ర, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

32 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్లతో నిర్మించనున్న ఈ మెగా డెయిరీ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి, ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోజువారీ పాల ఉత్పత్తి సామర్థ్యం 8 లక్షల లీటర్లకు పెరుగుతుంది. ప్రస్తుతం లాలాపేటలో ఉన్న విజయ ప్లాంట్‌కు రోజుకు మూడున్నర లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. మెగా డెయిరీతో పాలఉత్పత్తి సామర్థ్యం రెండు నుంచి మూడు రెట్లు పెరిగి, మరికొన్ని రకాల ఉత్పత్తులను భారీఎత్తున చేపట్టే అవకాశం లభించనుంది. చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రభుత్వ సంస్థ ఎంత వృద్ధి చెందుతుందో అనేదానికి విజయ డెయిరీ నిదర్శనమని మంత్రి తలసాని అన్నారు.

పాడి రైతుల చేయూత కోసం లీటరుపై రూ.4 ప్రోత్సాహం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం విజయ డెయిరీ ఉత్పత్తులు 28 ఉన్నాయని.. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో డెయిరీ ఔట్ లెట్లు ప్రారంభిస్తామని తలసాని ప్రకటించారు. డెయిరీ 365 రోజులు పాలు సేకరిస్తోందన్న మంత్రి తలసాని... మెగా డెయిరీ కార్యరూపం దాల్చితే వేలమంది రైతులకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. చనిపోయిన పాడి పశువుల స్థానంలో 50 శాతం రాయితీతో కొత్తవి ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఒక ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు దానిమీద స్పష్టమైన అవగాహనతో... ఒక ముఖ్యమంత్రి ప్రోత్సహించినప్పుడు మరి ఏ పద్ధతిన అభివృద్ధి ఉంటుందో అనేదానికి విజయడెయిరీ ఉదాహరణ. 2014లో రూ.300 కోట్లు టర్నోవర్​ ఉండేది. కానీ ఇప్పుడు రూ.750కోట్ల టర్నోవర్​తో విజయ తెలంగాణ ముందుకు వెళ్తుంది. సుమారు నాలుగున్నర లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఓ వైపున సన్న,చిన్నకారు రైతులను ప్రోత్సహిస్తూ... మరోవైపున వేలాదిమంది యువకులకు ఉపాధి కల్పించేలా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పటి వరకు 285కోట్ల 81 లక్షల రూపాయలు ఇన్సెంటివ్​ రూపంలో రైతులకు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పశుసంవర్ధక శాఖ మంత్రి

'పాడి రైతుల చేయూత కోసం లీటరుపై రూ.4 ప్రోత్సాహం '

ఇదీ చూడండి: TALASANI: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.