రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ వాలంటరీ పరిశోధన సంస్థ సమీపంలో లేగ దూడపై దాడి చేసిన చిరుత ఘటనపై... అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవుల యజమాని చిరుత దాడి చేసిందని చెప్పిన ప్రకారం పరిశీలిస్తున్నామని... అటవీశాఖ అధికారి శ్యామ్ సుందర్ పేర్కొన్నారు.
దాడి చేసిన మృగం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు నెలల క్రితం రాజేంద్రనగర్ కాటేదాన్ వద్ద రోడ్డుపై హల్‌చల్ చేసిన చిరుత కనిపించకుడా పోయింది. కొత్తగా ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో మరోసారి చిరుతపులి కలకలం