అనుమతి లేకుండా చెట్లను నరికేసినందుకు ఓ స్థిరాస్తి సంస్థకు అటవీశాఖ రూ. 4 లక్షల జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో 'వెస్ట్ సైడ్ వెంచర్స్'కు చెందిన భూమిలో ఉన్న 65 చెట్లను గత వారం నరికివేశారు.
స్థానికులు ఫిర్యాదు చేయటంతో తనిఖీ చేపట్టిన అధికారులు... చెట్లను విచక్షణారహితంగా తొలగించినట్లు నిర్ధరించారు. విచారణ అనంతరం... వాల్టా చట్టం ప్రకారం రూ. 4లక్షల జరిమానా విధించారు. తొలగించిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాలనే నిబంధన విధించారు.
ఇదీ చదవండి: huzurabad liquor sales: హుజూరాబాద్‌లో మద్యం అమ్మకాల జోరు.. కోట్లలోనే..!