ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో వరద బాధితుల ధర్నా

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్​పేట్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళన చేపట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ముంపు కాలనీల ప్రజలకు పదివేలు సాయం అందించాలంటూ భాజపా నాయకులు రోడ్డుపై బైఠాయించారు.

Flood people dharna at meerpet muncuipal office in bjp leaders
భాజపా ఆధ్వర్యంలో వరద బాధితుల ధర్నా
author img

By

Published : Nov 3, 2020, 3:34 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. మీర్​పేట్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు భాజపా నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారీ వర్షాల వల్ల నిత్యావసరాలు తడిసిపోయి ఇబ్బందులు పడుతున్న తమకు పదివేల రూపాయల వరద సాయం అందించాలని ధర్నా నిర్వహించారు. తెరాస కార్యకర్తలకు మాత్రమే సాయం అందిస్తున్నారని, నిజమైన బాధితులకు పరిహారం ఇవ్వడం లేదని భాజపా నాయకులు విమర్శించారు. తక్షణమే బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:డీజీపీని కలిసిన కాంగ్రెస్​ నేతలు... దుష్ప్రచారంపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.