వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఇస్తున్న రూ. 10వేల కోసం రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధి సాహెబ్ నగర్ రోడ్డుపై వరద బాధితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. సాహెబ్ నగర్లో కార్పొరేటర్ చెప్పిన ప్రాంతంలో ఒక్కో ఇంట్లోనే అందరికీ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. 10వేలను అందజేస్తోంది. కానీ ఈ నగదు తమకు అందలేదని బాధితులు రోడ్డెక్కారు.
సాయం రాలేదని అడిగిన వరద బాధితులకు అధికారులు సర్వర్ డౌన్ అంటూ వెళ్లి పోయారని అన్నారు. దీంతో స్థానిక హనుమాన్ టెంపుల్ కూడలిలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వరద సహాయం తమకు అందించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వేధింపులు తాళలేక సీపీని ఆశ్రయించిన మిస్సెస్ ఇండియా