రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అభిషేక్ అనే వ్యక్తి గత కొంతకాలంగా వాడి పడేసిక బ్యాటరీ డబ్బాలను పోగుచేసి.. వాటితో వ్యాపారం చేస్తున్నాడు. అయితే శనివారం ఒక్కసారిగా ఆ గోదాములో అగ్నిప్రమాదం సంభవించగా.. భారీ ఎత్తున మంటలు చేలరేగాయి.
దట్టమైన పొగలతో అగ్నికీలాలు ఎగసిపడగా.. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఆస్తినష్టం రూ. లక్షల్లో జరిగినట్లు నిర్వాహకులు అంచనా వేశారు. ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్