ETV Bharat / state

లిఫ్ట్​లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె.. - మణికొండ లాన్​కో హిల్స్

ఇది హైదరాబాద్ మహా నగరం.. ఇక్కడ నివసించే చాలా మందికి తమ ఇంటి పక్కన ఎవరు ఉంటారు, ఏం చేస్తారనే విషయమే తెలియదు. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి మరోలా ఉంటుంది. మాట పలకరింపులూ తక్కువగానే ఉంటాయి. ఏదో కమ్యూనిటీ మీటింగ్ అయితే తప్ప ఒకరినొకరు కలుసుకునే దాఖలు తక్కువగానే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితిలో ల్యాంకో హిల్స్​ లిఫ్ట్​లో తండ్రి కుమార్తె 40 నిమిషాల పాటు భయాందోళనతో యాతన అనుభవించారు.

ల్యాంకో హిల్స్​ లిఫ్ట్​లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె

author img

By

Published : May 10, 2020, 4:10 PM IST

Updated : May 10, 2020, 4:28 PM IST

రంగారెడ్డి జిల్లాలోని మణికొండ లాన్​కో హిల్స్ అదే అపార్టుమెంట్​లో నివసించే శ్రీనివాస్ రెడ్డి తన ఆరు సంవత్సరాల కూతురితో కలిసి లిఫ్ట్​లోకి ఎక్కాడు. 34వ అంతస్తుకు చేరుకున్నాక లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోలేదు. ఆందోళన చెందిన శ్రీనివాస్​ రెడ్డి ఫోన్ కాల్స్ చేసినా అపార్ట్​మెంట్ వాసులెవరూ స్పందించలేదు.

సుమారు 40 నిమిషాల పాటు లిఫ్ట్​లో ఇర్కుపోయి వేదన అనుభవించారు. చివరికి తానే స్వయంగా లిఫ్ట్ తలుపుల్ని తొలగించి కూతురుతో సహా బయటపడ్డారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండటం వల్ల తండ్రి, కూతురు ఫోన్​కు ఎవరు స్పందించలేదు. విపత్కరమైన దుస్థితిని శ్రీనివాస్​ రెడ్డి విజయవంతంగా ఎదుర్కొన్నారు.

ల్యాంకో హిల్స్​ లిఫ్ట్​లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

Last Updated : May 10, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.