Swamy Goud: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు గండిపేట మండల పరిధిలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. భాజపా నేత స్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కిస్మత్ పూర్ లోని తన ఇంటికి వస్తుండగా రోడ్డు పైనున్న గుంతలలో బైక్ స్కిడ్ కావడంతో స్వామి గౌడ్ కింద పడిపోయాడు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాగా బైక్‌పై నుండి పడటంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు.
ఇవాళ్టి ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమై కారణమని స్వామి గౌడ్ మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపేట మండల పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలమయపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు సూచించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదని స్వామి గౌడ్ ఆరోపిస్తున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
"ఈరోజు ఆజాదీకా అమృత్ మహాత్సవంలో భాగంగా బండ్లగూడ జాగీర్ పరిధిలో భాజపా తిరంగా ర్యాలీ నిర్వహించాం. అక్కడ రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. అదేవిధంగా మురికి నీరు రోడ్ల వెంట పారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి." - స్వామి గౌడ్, తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్
ఇవీ చదవండి: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం