లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజవర్గంలోని హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించారు. రిక్షా కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, స్వీపర్లు, ఎంటమాలజి సిబ్బందికి కలిపి 120 మందికి టిఫిన్ అందజేశారు. మొత్తంగా 470 మందికి భాజపా నేతలు కళ్లెం రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
చంపాపేట్ డివిజన్లోని 500 కుటుంబాలకు, మన్సూరాబాద్ డివిజన్ శివ గంగ కాలనీకి చెందిన 150 కుటుంబాలకు కూరగాయలు పంపించామని నేతలు పేర్కొన్నారు. నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే సరకుల పంపిణీకి ముందుకు వచ్చామని రవీందర్ రెడ్డి వివరించారు. హయత్ నగర్లోని గాంధీ బొమ్మ వద్ద సుమారు 300 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాజపా సీనియర్ నేత కొత్త రవీందర్ గౌడ్ , పార్టీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప, కాడారి యాదిగిరి యాదవ్, గోవిందా చారి, మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.