కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని పేపరస్ పోర్టు రిసార్ట్స్ సమీపంలో జోడో యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 125కేవీ, 62 కేవీ జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్‌లు అగ్నికి ఆహుతైనట్టు మహేశ్వరం అగ్నిమాపక శాఖ అధికారి రమేశ్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ ఐదో రోజు కొనసాగింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్ర.. సాయంత్రం షాద్‌నగర్ వద్ద ముగిసింది. షాద్‌నగర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు రాహుల్ పాదయాత్ర కొత్తూరు చేరుకోనుంది.
ఇవీ చదవండి: