రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఎంసెట్ పరిక్ష కేంద్రం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపించారు. మాస్కులున్న అభ్యర్థులనే లోనికి అనుమతించారు.
విద్యార్థులకు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఉదయం ఏడుగంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం