రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని మల్లికార్జున్ నగర్లో... అక్రమంగా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని... ఇంద్ర, పల్లవి, బిల్లా, బిజీ -3 అనే పేర్లతో ఉన్న 178 విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్యాకింగ్ యంత్రం, ముడి సరకును సీజ్ చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!