కరోనా మహమ్మారి కాటుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి పనులు దొరక్క, మరికొంతమందికి తినేందుకు తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో భిక్షాటనే తమ జీవనోపాధిగా బతికే హిజ్రాల పరిస్థితేంటీ.? వాళ్ళు ఎలా ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తున్నారు.? వారికి తోచినంత సహాయమందించాలని ఆలోచించిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్... కొంతమంది హిజ్రాలకు నిత్యావసరాలను అందించారు.
నిత్యం ఆలయ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనోపాధి పొందుతారని... ఆదివారం అమావాస్య, సూర్య గ్రహణం కారణంగా ఆలయం మూసి ఉంటుందని తెలిపారు. ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి : రాత్రి 9 గంటల నుంచి భద్రాద్రి ఆలయం మూసివేత