Demolition of illegal houses: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో అక్రమ ఇళ్లు నిర్మాణాలను పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం నుంచి తొలగిస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 283లో గత కొద్దిరోజులుగా స్థానిక నాయకులు సహకారంతో సుమారు 500 మంది పేదలు గుడిసెలు వేసుకొనగా మరికొందరు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇది గమనించిన రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు సహాయంతో ఈరోజు వాటిని కూల్చే పనిలో పడ్డారు.
కూల్చివేతలను కొందరు మహిళలు వ్యతిరేకించగా మరికొందరు స్థానిక తహశీల్దార్‌ను అడ్డుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ కొందరు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చదవండి: