రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం చేపట్టింది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా శంషాబాద్‌లోని సర్వీస్ రోడ్, సామ ఎన్క్లేవ్, ఇన్ఫాంట్ జీసెస్ స్కూల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. అనుమతుల్లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా... కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీఓ ఉన్నందున ప్లాట్లు కొనుగోలు చేసేముందు హెచ్ఎండీఏలో విచారించాలని అధికారులు సూచించారు.