రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వైస్ ఛైర్మన్ కొత్త కూర్మ సత్తయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ సంజీవ రెడ్డితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు బాసటగా నిలిచారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 230 మంది పారిశుద్ధ్య కార్మికులకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మున్సిపల్ కార్మికుల కృషి వెలకట్టలేనిదని... వారికి ఎంత చేసినా తక్కువేనని వారి సేవలను కొనియాడారు. ప్రజలంతా లాక్డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొని కరోనా నివారణలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!