రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా "స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్" కోసం 12 రకాల గ్రూపులకు చెందిన వ్యక్తులను గుర్తించి టీకాల కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై ఎక్స్‌పోజర్ గ్రూపులకు టీకా ఇస్తున్న కేంద్రాన్ని సీఎస్ సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సీడీఎంఏ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. హై ఎక్స్‌పోజర్ క్యాటగిరిలో భాగంగా కిరణా షాపుల్లో పనిచేస్తున్న వారు, వీధి వ్యాపారులు, సెలూన్లలో పని చేసే వ్యక్తులందరికీ… రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రారంభించామని చెప్పారు.
ఆయా సిబ్బంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పురపాలక శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ రూపొందించిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. నేరుగా వచ్చే వారికి మాత్రం వ్యాక్సినేషన్ చేయడం జరగదని సీఎస్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'