ETV Bharat / state

తగ్గిన కరోనా నిర్ధరణ పరీక్షలు.. అనుమానితుల ప్రదక్షిణలు - శేరిలింగంపల్లిలో క్యూ కట్టిన అనుమానితులు

రెండు రోజులుగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు తగ్గడంతో అనుమానితులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నగరంలో పలుచోట్ల కనీసం వందమందికి కూడా టెస్టులు చేయడం లేదు.

crowd at corona test centre at sherilingampally
కరోనా పరీక్షల కోసం వచ్చిన అనుమానితులు
author img

By

Published : Apr 29, 2021, 11:51 AM IST

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల కోసం అనుమానితులు తరలివచ్చారు. రెండు రోజులుగా టెస్టుల సంఖ్య తగ్గడంతో ప్రజలు అధిక సంఖ్యలో కేంద్రాలకు వస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం కరోనా నిర్ధరణ కిట్లు ఉన్నా వాక్సినేషన్ కార్యక్రమం ఉండటంతో పరీక్షలు తక్కువ చేస్తున్నట్లు తెలిపారు.

కరోనా లక్షణాలు లేకున్న కొందరు పరీక్షల కోసం వస్తున్నారని పీహెచ్​సీ ఇంఛార్జ్ వైద్యాధికారి స్వామి వెల్లడించారు. అలాంటి వారిని వెనక్కి పంపించడం జరుగుతోందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వాక్సినేషన్ కోసం సైతం ప్రజలు తరలివస్తున్నారని ఇది శుభపరిణామమని అన్నారు.

ఇదీ చూడండి: జీవ వ్యర్థం.. జర భద్రం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.