పదిరోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు మధు యాదవ్‌ను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశఆరు. రాజేంద్రనగర్ బుద్వేల్‌లో నివాసముంటున్న మృతురాలి కుటుంబ సభ్యులను పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు.
బతుకుదెరువు కోసం ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలికపై అత్యాచారం చేసి, అనంతరం హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన మధు యాదవ్‌పై నిర్భయ, హత్యానేరోపణలపై కేసు నమోదు చేయాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బాలిక మరణించి పది రోజులు గడిచినా.. నిందితునిపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శమనమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి: అమానుషం: బాలికపై పైశాచికం... హత్యాచారయత్నం