ETV Bharat / state

భాజపాపై పోరుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు కలసి రావాలి: డి.రాజా - Shamshabad CPI public meeting news

D.RAJA COMMENTS ON BJP: భాజపా విధానాలను విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్​ పోరాటం చేస్తున్నారని.. ఆ​ పోరాట పంథాను కొనసాగించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆకాంక్షించారు. భాజపా, ఆర్ఎస్ఎస్​ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని పేర్కొన్నారు. భాజపాను గద్దె దింపేందుకు ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలు కలసి రావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో జరిగిన సీపీఐ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

భాజపాపై పోరుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు కలసి రావాలి: డి.రాజా

author img

By

Published : Sep 4, 2022, 7:37 PM IST

భాజపాపై పోరుకు ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు కలసి రావాలి: డి.రాజా

D.RAJA COMMENTS ON BJP: భాజపా, ఆర్​ఎస్​ఎస్​ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో జరిగిన సీపీఐ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్​ పోరాటం చేస్తున్నారని.. ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని డి.రాజా ఆకాంక్షించారు. మిగతా ప్రాంతీయ పార్టీలు, లౌకికవాద శక్తులు కలిసి రావాలని ఆయన కోరారు.

ఈ క్రమంలోనే భాజపా, ఆర్ఎస్ఎస్​ చేతుల్లో దేశం సురక్షితంగా లేదని డి.రాజా పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు 2024 ఎన్నికలు చాలా కీలకమైనవని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలు 2024లో ఉమ్మడిగా పోరాటం చేసి భాజపాను గద్దెదింపుదామని కోరుతున్నామన్నారు.

భాజపా విధానాలను విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ కేసీఆర్​ పోరాటం చేస్తున్నారు. కేసీఆర్​ పోరాట పంథాను కొనసాగించాలి. దేశ భవిష్యత్తుకు 2024 ఎన్నికలు చాలా కీలకమైనవి. భాజపా, ఆర్ఎస్ఎస్​ చేతుల్లో దేశం సురక్షితంగా లేదు. దేశ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య, లౌకిక, ప్రాంతీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2024లో ఉమ్మడిగా పోరాటం చేసి భాజపాను గద్దెదింపుదామని కోరుతున్నాం. - డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇవాళ ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర మహాసభలు.. ఈ నెల 7న జరిగే ప్రతినిధుల సమావేశాలతో ముగియనున్నాయి. నేడు జరిగిన బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఎర్రదండు కదిలి వచ్చింది. సీపీఐ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి డప్పుకొట్టి.. శ్రేణులను ఉత్సాహపరిచారు.

ఇవీ చూడండి..

మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు సీపీఐ మద్దతు

'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.