ETV Bharat / state

పైసలిస్తే  అందలం  ఎక్కిస్తా... కాదంటే  కాళ్లు పట్టిస్తా - ఎమ్మార్వో లావణ్య

నెల నెలా వేలకు వేలు జీతం... సమాజంలో పేరు ప్రఖ్యాతలు.. ప్రజలు ఇచ్చే గౌరవ మర్యాదలు.. మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దే ప్రభుత్వాధికారం. ఇవేవీ ఆమెకు సరిపోలేదు. పేదోడి చెమటను దోచుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది చేయి తడపందే పనిజరగదంటూ అక్రమాలుకు తెరలేపింది. ఇది కేసంపేట తహసీల్దారు కార్యాలయంలోని లంచావతారిణి లావణ్య దందాతీరు.

పైసలిస్తే  అందలం  ఎక్కిస్తా... కాదంటే  కాళ్లు పట్టిస్తా
author img

By

Published : Jul 11, 2019, 8:12 PM IST

Updated : Jul 11, 2019, 8:48 PM IST

పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా

ఇదో తహసీల్దారు కార్యాలయం ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి లంచాలు ఇవ్వనక్కరలేదు అనే బోర్డు చూసి మోసపోయేరు. ఇక్కడ చేయి తడపందే అంగుళం కూడా ఫైలు కదలదు. కింది స్థాయి సిబ్బంది నుంచి తహసీల్దారు వరకూ ప్రతి పనికీ ఓ రేటు.. రేటుకు తగ్గ ప్రతిఫలం అని లోనికి అడుగుపెట్టగానే తెలిసిపోతుంది. రంగారెడ్డి జిల్లా కేసంపేట మండల తహసీల్దారు లావణ్య... దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సర్వీసులో ఉండగానే నాలుగు కాసులు వెనకేసుకునేందుకు లంచావతారిణిగా అవతారమెత్తింది.
మీరే లంచమడిగితే ఇంకెవరికి చెప్పుకోవాలి

కార్యాలయంలోని గోడలపై వీఆర్​ఏ, వీఆర్వో నుంచి సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే తహసీల్దారుకు ఫిర్యాదు చేయండి అనే బోర్డులు కట్టారు. మరి తహసీల్దారే లంచం డిమాండ్​ చేస్తే ఏంచేస్తాం. పై స్థాయి అధికారులకు సమాచారం అందించే సాహసం సాధారణ ప్రజలు, రైతులు చేయగలరా.. ఇదే అస్త్రంగా మార్చుకుని కొన్నేళ్లుగా అక్రమదందాకు తెరలేపింది లావణ్య. మధ్యవర్తులుగా కింది స్థాయి సిబ్బందిని ఉపయోగించడం వచ్చిన మొత్తంలో వాటాలు వేసుకొని పంచుకోవడం నిత్యకృత్యంగా మారింది.

చేయి తడపనిదే పనవ్వదు..

ఈ కార్యాలయంలో అధికారులకు లక్ష్మీకటాక్షం కలిగించకపోతే ఎన్నిరోజులైనా పనికాదు. పైసలిస్తేనే క్షణాల్లో పనైపోయి బైటపడిపోవచ్చు. లేకుంటే కాళ్లావేళ్లా పడినా పనవ్వదు. తమకు ఆర్థిక స్తోమత లేదని రైతులు కాళ్లు పట్టుకున్నా కనికరించేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దారు లావణ్య తమకు న్యాయం చెయ్యడం లేదంటూ ఆకుల లలిత అనే మహిళా రైతు గతంలో కార్యాలయం ముందే ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇన్ని ఆగడాలకు పాల్పడుతున్నా ఆమెపై ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారు కాదని స్థానికులు వాపోతున్నారు.

సర్కారు ఆశయానికి తూట్లు పొడుస్తూ..

ఓ వైపు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఓవైపు ఉత్తమ ఉద్యోగిగా అవార్డులు తీసుకుంటూనే.. మరోవైపు ప్రజల సొమ్మును రక్తంలా పీల్చుకుతాగుతున్నారు. నిత్యం ఎంతో మంది ఏసీబీకి దొరుకుతున్నా దర్జాగా దందా చేసుకుపోతున్నారు. ఇచ్చే వాడుండాలే కాని తీసుకోవడానికి మాకేమిటంటూ ఉద్యోగాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చేస్తున్నారు. దొరికిపోతే ఏమౌతుంది మహా అయితే కొన్నాళ్లు జైల్లో ఉంటాం.. అంతేగా అన్న అభిప్రాయంతో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టాలు కూడా పటిష్ఠంగా లేకవపోవడం ఇలాంటి ఉద్యోగులకు వరంగా మారింది.
ఇదీ చూడండి: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Last Updated : Jul 11, 2019, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.