కరోనా మహమ్మారి రెండో దశలో విశ్వరూపం చూపిస్తోంది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స కోసం వచ్చి ఓ వ్యక్తి మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఆయన స్వల్ప లక్షణాలతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి గురువారం వచ్చారని వైద్యులు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అన్నారు.
కరోనా అనుమానితులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివస్తున్నారు. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ర్యాపిడ్ పరీక్షలు లేకపోవడం వల్ల గంటల తరబడి క్యూలైన్లలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశతోనే వెనుదిరగాల్సి వస్తోందని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: కరోనాకు మనో ధైర్యమే మందు: డాక్టర్ ఎంఎస్ రెడ్డి