ETV Bharat / state

షాద్​నగర్​ పట్టణంలో ఏడుకు చేరిన కరోనా కేసులు

రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో కరోనా కేసులు ఏడుకు చేరుకున్నాయి. బాధితుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. నమోదైన ఏడు కేసుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

corona update in shadnagar in rangareddy district
షాద్​నగర్​ పట్టణంలో ఏడుకు చేరిన కరోనా కేసులు
author img

By

Published : May 27, 2020, 4:21 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే ఐదు కేసులు నమోదు కాగా బుధవారం తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి.వీటిలో ఏడాది చిన్నారి కూడా ఉండడం గమనార్హం. నమోదైన ఏడు కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు.

మంగళవారం జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్మి ఆధ్వర్యంలో 50 మందికి పైగా పరీక్షలు నిర్వహించారు.వీరిలో అనుమానితులను హైదరాబాదుకు తరలించి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీనితో వైద్య శాఖ అధికారులు మరిన్ని పరీక్షల ద్వారా పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి: సీఎం సమీక్ష.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.