ETV Bharat / state

ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

రంగారెడ్డి జిల్లాలోని అజీజ్​నగర్​లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు బాధితులందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Corona to six of the same family at ajijnagar in rangareddy district
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
author img

By

Published : Jun 2, 2020, 7:44 PM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్​నగర్​లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా బారినపడ్డారు. టోలీచౌకీలో వాటర్​ సిబ్బందిగా పని చేసే వ్యక్తి వారం రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్​ అని నిర్ధారణ అయింది. ఫలితంగా అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం అతని కుటుంబ సభ్యులను కింగ్​ కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. కుటుంబంలోని మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని​ తేలింది. ఫలితంగా వీరందరినీ మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొయినాబాద్ మండలంలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమతం చేస్తున్నామని ఎమ్మార్వో అనిత పేర్కొన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు.

ఇదీచూడండి: ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.