ETV Bharat / state

షాద్​నగర్​లో యువకుడికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు! - షాద్​నగర్​లో కరోనా కేసు

రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​లో యువకుడికి కరోనా పాజిటివ్​ అని తేలడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. యువకుడు నివాసముండే ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించి అనుమానితులను క్వారంటైన్​కి తరలించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యాపార సముదాయాలు మూసివేశారు.

Corona Positive Case Found In Shad Nagar
షాద్​నగర్​లో యువకుడికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు!
author img

By

Published : May 23, 2020, 8:34 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​ పట్టణంలో యువకుడికి కరోనా పాజిటివ్​ అని తేలడం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో ఆ యువకుడు నివాసముండే ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించారు. గంజ్, మెయిన్​రోడ్డు, విజయనగర్​ కాలనీ, ఈశ్వర్​ కాలనీలను అధికారులు కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

ఆయా ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు మూసివేశారు. అనుమానితులుగా భావించిన 20 మందిని క్వారంటైన్​కి తరలించారు. పురపాలిక సిబ్బంది రంగంలోకి దిగి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. డీసీపీ ప్రకాష్​ కంటైన్​మెంట్​ జోన్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.