హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలలో మంగళవారం వరకు 19 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాచారంలో 9 మందికి పాజిటివ్ ఉండగా ముగ్గురు వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో 6 మందిలో ఒక్కరు మహమ్మారిని నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంచాల మండలంలో నలుగురికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, ఒక్కరు జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయితీ కార్యదర్శికి కరోనా సోకగా ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. అందరిని తమతమ ఇళ్లలో క్వారంటైన్లో ఉంచినట్లు, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా